భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…జగన్ అరెస్ట్ కి టైమూ డేట్ ప్లేస్ ఫిక్స్ ?
వైసీపీ అధినేత ఇంటి ముందు దాకా అరెస్ట్ వ్యవహారం వచ్చేసిందా అంటే జరుగుతున్న ప్రచారం చూస్తే అదే అనిపిస్తోంది అని అంటున్నారు. వైఎస్ జగన్ అరెస్ట్ తప్పదు అని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఇపుడు నిజం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

జగన్ విషయానికి వస్తే ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని పేర్కొంటూ గత కొంతకాలంలో పోలీసులు విచారిస్తున్నారు. మొదట సీఐడీ ఈ కేసుని డీల్ చేస్తూ వచ్చింది ఇక ఆ మీదట సిట్ ని రంగంలోకి దింపారు. సిట్ వరసబెట్టి అనేకమంది నాయకులను విచారిస్తూ అరెస్ట్ చేస్తొంది.
ఇక ఈ కేసులో జగన్ ప్రస్తావన ఎందుకు అంటే ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డిని చాలా కాలం క్రితమే అరెస్ట్ చేసారు. దాంతో జగన్ చుట్టూనే ఈ కేసు తిరుగుతోంది అని అంతా ప్రచారం చేశారు. ఇక తాజాగా చూస్తే వైసీపీ హయాంలో పనిచేసిన ధనుంజయరెడ్డి, క్రిష్ణ మోహన్ రెడ్డిలను విచారించి మరీ అరెస్ట్ చేయడంతో ఈ కేసు ఏకంగా జగన్ వరకూ వచ్చేసినట్లే అని ప్రచారం చేస్తున్నారు.
ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన మీద గతంలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారు అని అంటూ క్విడ్ ప్రోకో ఇందులో ఉందని చెబుతూ ఆయన మీద సీబీఐ 11 చార్జిషీట్లను దాఖలు చేసింది. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది.
అయితే ఇపుడు జగన్ మీద కొత్తగా లిక్కర్ కేసుని తీసుకుని వస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ని రాజకీయంగా బదనాం చేయడానికే ఈ కేసు అని అంటున్నారు. తాము కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రులు పేర్ని నాని అంబటి రాంబాబు వంటి వారు చెబుతున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ సైతం జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఈ కేసులో వరస అరెస్టులతో ఆయన సైతం రానున్న పరిణామాలను గమనిస్తున్నారు అని అంటున్నారు. వీటి సంగతి పక్కన పెడితే జగన్ అరెస్టుకు ముహూర్తం ఖరారు అయింది అన్న వార్తలే ఇపుడు ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి.
ఈ నెల 27, 28, 29 తేదీలలో కడప జిల్లా కమలాపురంలో టీడీపీ మహానాడు ఉంది. ఆ మహానాడుకు ముందే జగన్ ని అరెస్ట్ చేస్తే క్యాడర్ లో ఫుల్ జోష్ వస్తుందని అంటున్నారుట. అయితే అదే సమయంలో జగన్ సొంత జిల్లాలో మహానాడు జరుగుతోంది. అందువల్ల ఏమైనా ఇబ్బందులు మహానాడుకు ఈ అరెస్ట్ వల్ల వస్తాయేమో అన్న మరో కోణంలో కూడా కొందరు ఆలోచన చేస్తున్నారుట.
ఇలా జగన్ అరెస్ట్ మహనాడు ముందా తరువాత అన్న చర్చ కూడా సాగుతోందిట. అయితే జగన్ అరెస్ట్ కచ్చితంగా ఇదే నెలలో ఉంటుందని స్పష్టంగా చెబుతున్న వారూ ఉన్నారు ఇంకో వైపు చూస్తే జగన్ అరెస్ట్ ని బెంగళూరులోనే చేయాలని అలా ఆయనను అక్కడ నుంచే విజయవాడ తీసుకుని రావాలని ఆలోచిస్తునారు అని ప్రచారం సాగుతోంది. ఇక టైం విషయంలో కూడా ప్రచారం ఉంది. రాత్రి వేళలో అరెస్ట్ చేస్తారా లేక పొద్దు పొద్దునే అరెస్ట్ చేస్తారా అన్నది కూడా వేడెక్కించే చర్చగానే ఉంది.
ఇకా డేట్ టైం ప్లేస్ అని ఫిక్స్ చేసుకుని అరెస్ట్ ని రంగం సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. అయితే లిక్కర్ స్కాం కేసులో ఈ రోజుకీ సరైన అధారాలు లేవని జగన్ ని ఎలా అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు చూస్తే కూటమి ప్రభుత్వం అధికరంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తి అవుతుంది.
ఈ లోగాన జగన్ అరెస్ట్ చేయడం ద్వారా రానున్న నాలుగళ్ళ పాలిటిక్స్ ని ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పేలా చూడాలన్నది ఒక ఎత్తుగడగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ అరెస్ట్ అనివార్యం అని సోషల్ మీడియా నుంచి ఇతర సామాజిక మాధ్యమాలలతో పాటు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.