భారత్ న్యూస్ ఢిల్లీ…..చకచకా పూరీ జగన్నాధ రథచక్రాల తయారీ
పూరీ :

పూరీ జగన్నాథుని రథయాత్ర సమీపించినందున శ్రీక్షేత్ర పాలనా కార్యాలయంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల మూడు రథాల 42 చక్రాల పనులు చకచకా జరుగుతున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటలకు సేవాయత్లు నిష్టగా ఈ పనులు నిర్వహిస్తున్నారు. చక్రాలకు ఇరుసుల అమరిక తర్వాత రథాల ప్రాకారాల నిర్మాణాలు జరుగుతాయి. చిత్రకార్ సేవాయత్లు రథాలపై అమర్చే బల్లలపై దేవతా చిత్రాలు చెక్కుతున్నారు.