ఉపాధి హామీ వేతన బకాయిలు 1805 కోట్లు విడుదల

భారత్ న్యూస్ రాజమండ్రి…ఉపాధి హామీ వేతన బకాయిలు 1805 కోట్లు విడుదల

ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం 1805 కోట్లు విడుదల చేసింది. 2025-26 సంవత్సరానికి విడుదల చేసిన పెండింగ్ బకాయిలు త్వరలోనే శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

ఉపాధి పనులకు హాజరైన శ్రామికులకు గతేడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు 1042 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కేంద్రం ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో చెల్లించనున్నారు. మిగిలిన నిధులు ఈ నెలాఖరు వరకు చేసే పనులకు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు…