స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొన్న విక్కుర్తి.

భారత్ న్యూస్ గుంటూరు…..స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొన్న విక్కుర్తి.

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చల్లపల్లి హైవే వద్ద స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు సోమవారం నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో విక్కురి పాల్గొన్నారు. స్వచ్ఛ సైనికులతో కలిసి ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాస్ చల్లపల్లిలోని జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపులా గల ముళ్ళ కంపలు, చెత్తను తొలగిస్తూ శ్రమదానం చేశారు.

ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ, భారతదేశ స్థాయిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ప్రశంసలు అందుకోవడం సంతోషదాయకమన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డి.ఆర్.కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి ల ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యకర్తల సేవలు అభినందనీయమన్నారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఎన్నో సంవత్సరాల నుంచి చల్లపల్లి పంచాయతీ పరిధిలో నిర్విరామంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి దేశానికే ఆదర్శమన్నారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డిఆర్.కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి, విక్కుర్తి శ్రీనివాస్ సోదరుడు రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, వి.ఎస్.ఆర్ యువసేన సభ్యులు పులిగడ్డ చంద్ర, బర్మా శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీహరి, ఎస్ పున్నయ్య చౌదరి, షేక్ బాజీ, చంటి హోటల్ ప్రసాద్ లతో పాటు స్వచ్ఛ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.