భారత్ న్యూస్ విజయవాడ…తిరువూరు
వరి కోత యంత్రములకు టోకెన్లు- వ్యవసాయ శాఖ, తిరువూరు మండలం
గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వరి కోత యంత్రాల యజమానులకు మరియు రైతులకు గమనిక.

వరి కోతలు జరుగుతున్న తరుణంలో డీజిల్ అవసరము ఉన్న వరి కోత యంత్రాల యజమానులు సంబంధిత గ్రామ వ్యవసాయ/ఉద్యాన మరియు గ్రామ రెవెన్యూ అధికారి వద్దకు యంత్రాల సీ బుక్ మరియు ఏ సర్వే నెంబర్ లో హార్వెస్ట్ చేస్తున్న వివరాలు తో సంప్రదించి, గ్రామ వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారుల వద్ద టోకెన్లు పొంది డీజిల్ తీసుకోవలెను . కాబట్టి రైతులు మరియు హార్వెస్టర్ల యజమానులు ఆందోళన పడవద్దని తెలియజేయడమైనది