రైతులకేమో చెరువుల్లో ఇస్తూ.. సన్నిహితులకేమో మంచి ప్లాట్లా?

భారత్ న్యూస్ విశాఖపట్నం..రైతులకేమో చెరువుల్లో ఇస్తూ.. సన్నిహితులకేమో మంచి ప్లాట్లా?

-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు తీరును ప్రశ్నిస్తున్న రాజధాని రైతులు

నీరుకొండలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూతురు 5.39 ఎకరాలు సీఆర్డీఏకు అప్పగింత

ఫలితంగా వెస్ట్ బైపాస్ కు పక్కనే 1,500 గజాల చొప్పున రెండు.. 1,000 గజాల చొప్పున మరో రెండు నివాస ప్లాట్లు కేటాయింపు

ఎస్ఆర్ఎం వర్సిటీకి ఎదురుగా కూడలిలో 660 గజాల చొప్పున ఇంకో రెండు వాణిజ్య పాట్లు

చంద్రబాబుకు సన్నిహితులైన బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకూ ఇదే రీతిలో ప్రాధాన్యం

సచివాలయానికి కూతవేటు దూరంలో, సీఎం ఇంటికి సమీపంలో ప్లాట్ల కేటాయింపు

వారు సీఎం కోటరీ కావడం వల్లే చేతివాటం ప్రదర్శించారని ప్రభుత్వం, సీఆర్డీఏపై రైతుల ఆగ్రహం

తమకేమో చెరువులు, వాగులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలిచ్చారని మండిపాటు..