ఏపీ ఉద్యాన పంటల రైతులకు గుడ్ న్యూస్

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీ ఉద్యాన పంటల రైతులకు గుడ్ న్యూస్

రూ.13,300 నుంచి ఏకంగా రూ.50,000కు పెంచిన రాయితీ

అమరావతి :

ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటల రైతులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు ఉపాధి హామీ పథకం కింద 100 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మామిడి తోటల కోసం ఎకరాకు రాయితీని రూ.13,300 నుంచి రూ. 50,000కి పెంచింది. రైతులు ఉచితంగా పండ్ల మొక్కలు పొందడమే కాకుండా, మూడు సంవత్సరాలపాటు సాగు ఖర్చులు, నీటి సరఫరా, పురుగుమందులు, ఎరువులకు అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం భరించనుంది..