పాకాల మండలం ఇరంగారిపల్లి గ్రామ సమీపంలో పురాతన అమ్మవారి విగ్రహం లభ్యం

పాకాల మండలం ఇరంగారిపల్లి గ్రామ సమీపంలో పురాతన అమ్మవారి విగ్రహం లభ్యం

భారత్ న్యూస్ తిరుపతి…జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి సమీపంలో రోడ్డు పక్కన శుక్రవారం జేసిబితో పనులు చేస్తుండగా భూమిలో నుంచి అమ్మవారి విగ్రహం బయటపడింది.విగ్రహం బయటపడిన విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి విగ్రహానికి పసుపు,కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి విగ్రహాన్ని దర్శించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా తరలివచ్చారు.ఈ సందర్బంగా సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం బయట పడిందన్నారు.అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.అమ్మ వారి విగ్రహం బయటపడడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు.ఈ గ్రామంలో అమ్మ వారి విగ్రహం వెలుగులోకి రావడం తమ అదృష్టమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.