పోలీసు అధికారిపై అత్యాచార యత్నం ఆరోపణలు: న్యాయం కోరుతున్న బాధితురాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…పోలీసు అధికారిపై అత్యాచార యత్నం ఆరోపణలు: న్యాయం కోరుతున్న బాధితురాలు

చిలకలూరిపేట పట్టణంలో ధనలక్ష్మి అనే మహిళ మీడియాతో మాట్లాడారు వినుకొండ మండలం ధనలక్ష్మి అనే ఓ మహిళపై పోలీసు అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. బాధితురాలు ధనలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, తాము బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నామని, ఆ ఇంటిని లీజుకు తీసుకుని ఐదు నెలలుగా అక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. నిందితుడైన **సి.హెచ్. చిన్న మల్లయ్య అనే సి.ఐ గతంలో విధి నిర్వహణలో భాగంగా శని, ఆదివారాల్లో అక్కడే ఉండేవారని, ప్రస్తుతం సస్పెండ్ అయిన తర్వాత పూర్తిగా అక్కడే ఉంటున్నారని ఆమె తెలిపారు.

ఒక రోజు ఉదయం తన భర్త పని మీద బయటకు వెళ్లిన సమయంలో, నిందితుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గదికి తాళం వేసి బలవంతం చేశారని, తాను ఎంత ప్రతిఘటించినా వదల్లేదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడమే కాకుండా, తన కొడుకు ద్వారా తనకు బెదిరింపు సందేశాలు పంపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన పోలీసు పదవిలో ఉండి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడం దారుణమని, తనకు న్యాయం జరగాలని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మరియు అధికారులను వేడుకున్నారు.