భారత్ న్యూస్ శ్రీకాకుళం….వైఎస్ఆర్సీపీ అంటేనే హంతకుల ఉత్పత్తి కేంద్రం: టీడీపీ నేత,దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు
అవనిగడ్డ:తెలుగుదేశం పార్టీ సమాజం కోసం మంచి చేసే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అయితే, వైఎస్ఆర్సీపీ హంతకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని టీడీపీ నేత,దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు చేయడం, సాక్షులను బెదిరించడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు నిత్యం శవ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కొల్లూరి ధ్వజమెత్తారు.దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అనంతబాబును జగన్ వెనుకేసుకురావడం ఆయన సైకోతనానికి పరాకాష్ట అని విమర్శించారు.జగన్ అరాచక పాలన వల్ల బలహీన వర్గాలు, ముఖ్యంగా బీసీలు, దళితులే ఎక్కువగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోదని, బాధితులకు న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో పూర్తి అప్రమత్తతతో ఉందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండలి రామమోహనరావు,క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ,పార్టీ నాయకులు ఘంటసాల రాజమోహనరావు,దాసినేని శ్రీనివాసరావు,షేక్ బాబావలి,నాగిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు
