భారత్ న్యూస్ విజయవాడ…BJP అభ్యర్థిని పరిగెత్తించి కొట్టిన TMC శ్రేణులు..
బెంగాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కుమార్ గంజ్ బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్‌పై TMC కార్యకర్తలు దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తగ్గలేదు. దీంతో సుబేందు తప్పించుకొని పొలాల్లోకి పరిగెత్తారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు రాగా స్థానికులతో వాగ్వాదం జరిగి ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం.
