భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో ఇక ఇంటి నుంచే 10 నిమిషాల్లో పోలీస్ ఫిర్యాదు నమోదు
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సామాన్య ప్రజల కోసం విప్లవాత్మక AI పోలీసింగ్ సిస్టమ్ ను రూపొందించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లే భయం లేకుండా, ఇంట్లో కూర్చునే కేవలం 10 నిమిషాల్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈ ఏఐ మనిషిలా మాట్లాడుతూ బాధితుల వయస్సును బట్టి తన సంభాషణను మార్చుకుంటూ వివరాలు సేకరిస్తుంది. త్వరలోనే దీనిని వాట్సాప్ కు అనుసంధానం చేయనున్నారు. ఈసాంకేతికత ఎంతో భద్రతను, భరోసాను కల్పిస్తుందని నిపుణులు
ప్రశంసిస్తున్నారు.
