ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని యువ అథ్లెట్ అగసర నందిని గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్..ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని యువ అథ్లెట్ అగసర నందిని గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణపతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై తెలంగాణ ప్రతిష్టను చాటిచెప్పిన నందిని గారిని ముఖ్యమంత్రి గారు అభినందించారు. ఇటీవల దక్షిణ కొరియా వేదికగా జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ అథ్లెట్ అగసర నందిని భారత్ తరఫున స్వర్ణపతకం సాధించారు.