రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు: మంత్రినాదెండ్ల మనోహర్

భారత్ న్యూస్ గుంటూరు…..రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు: మంత్రి
నాదెండ్ల మనోహర్

అమరావతి :

ఏపీలో రేషన్ కార్డుదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని వెల్లడించారు. రేషన్ దుకాణాల మూలంగా ప్రజా పంపిణీ పారదర్శకంగా కొనసాగుతుందని, దివ్యాంగులు, వృద్ధులకి రేషన్ డీలర్లు సరుకులు ఇళ్ల వద్దకే తీసుకువచ్చి అందిస్తారని తెలిపారు. మరోవైపు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ రేషన్ షాపుల వద్ద సరుకులు పంపిణీ చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే