భారత్ న్యూస్ హైదరాబాద్ …మీకు మీరు “సూపర్ కాప్స్” అనుకుంటే కుదరదు
హైడ్రా ఏర్పాటుకు కారణమైన 191 జీవోకు లోబడి ఉండకపోతే కఠిన చర్యలు తప్పవు
హైడ్రాపై మరోసారి అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు
మల్కాజ్‌గిరి మండలం లోతుకుంట ప్రాంతంలోని సర్వే నంబర్ 1,2లో ఉన్న ఆస్తి విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసి ఓడిపోయిన ప్రభుత్వం
ప్రభుత్వం ఓడిపోయి, ఆ భూమిపై తమకు పూర్తి అధికారం ఉందని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, హైడ్రా తమ భూమిలోకి ప్రవేశించిందని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన భూ యజమాని
ఈ పిటిషన్ విచారిస్తూ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత హైడ్రా ఆ భూమి జోలికి వెళ్లడం ఏంటని, హైడ్రా కూడా ప్రభుత్వంలో ఒక భాగమేనని మర్చిపోవద్దని మండిపడ్డ న్యాయమూర్తి

మీరు ప్రత్యేక వర్గమని, సూపర్ కాప్స్ అనే భావనలో ఉన్నారని, చట్టాన్ని అతిక్రమిస్తే కోర్టు చూస్తూ కూర్చోదని, 191 జీవోకు కట్టుబడి పని చేయాలని హైడ్రాను హెచ్చరించిన తెలంగాణ హైకోర్టు