.భారత్ న్యూస్ హైదరాబాద్….HYD: మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన సీఎం సతీమణి, కూతురు
హైదరాబాద్ హైటెక్స్లో మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు ప్రారంభమయ్యాయి. పలు దేశాలకు చెందిన సుందరీమణులు పోటీ పడుతున్నారు. ఈ పోటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత, కూతురు నైమిషా రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆయన భార్య నందిని, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
