భారత్ న్యూస్ ఢిల్లీ…..రూ.3 వేలకు కక్కుర్తిపడి.. 26 ప్రాణాలు బలి
పహల్గాంలో ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరి స్థానికుల పాత్ర ఉన్నట్లు తేలింది. ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులకు వారు ఆశ్రయం కల్పించారు. ఈ విషయం పోలీసులకు తెలపకుండా వారిని రహస్యంగా ఉంచారు. ఇందుకోసం వారు రూ.3 వేలు తీసుకున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ ఇద్దరు స్థానికులు జైలులో ఉన్నారు.
