సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్

…భారత్ న్యూస్ హైదరాబాద్….సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్

రాష్ట్రపతి భవన్‌ లో బుధవారం ఉదయం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమా ణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు.

ఈ ప్రమాణస్వీకార కార్యక్ర మానికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు,గవర్నర్లు తదితరులు హాజరయ్యా రు. జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ రికార్డులకెక్కారు.

జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24వ తేదీన మహారాష్ట్రలోని అమరా వతిలో జన్మించారు. 1985 లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత, భోసలే వంటి సీనియర్ న్యాయవాదుల తో కలిసి పనిచేశారు.

అనతికాలంలోనే స్వతం త్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన మునిసిపల్ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు…