భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

భారత్ న్యూస్ ఖమ్మం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

వైద్యులు లేకపోవడంతో కాన్పు చేసిన నర్సు.. తల్లి, బిడ్డ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో వనజ(20) అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ కాన్పు చేసిన నర్సు

కాన్పు తర్వాత శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లడం గమనించి ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించిందని తెలిపిన వైద్యులు

కాన్పు అనంతరం తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం తమ కుటుంబంలో తీరని శోకాన్ని నింపిందని ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు…