భారత్ న్యూస్ విజయవాడ…ఉపాధ్యాయ బదిలీలలో పాయింట్లు కేటాయించే విషయంలో పైరవీలకు పాల్పడిన T నరసాపురం మండల విద్యాశాఖ అధికారి… వారు రాసి ఇచ్చిన పై లెటర్ దీనికి రుజువు☝️
పైరవీలు చేసి లక్షలు పెట్టి దొడ్డిదారిని ట్రాన్స్ఫర్లు చేసుకోలేని వారు బదిలీల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు
ఈ బదిలీలలో ఒక సంవత్సరం సర్వీసు కు 0.5 మార్కులు కేటగిరి 4 పాఠశాలలో అంటే రోడ్డు సౌకర్యం లేని పాఠశాలలో పనిచేస్తే స్టేషన్ పాయింట్స్ గా సంవత్సరానికి 5 పాయింట్లు కేటాయించడం జరుగుతుంది ఒక ఉపాధ్యాయుడు 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా అతనికి సంవత్సరానికి 0.5 పాయింట్లు చొప్పున కేవలం 15 పాయింట్లు మాత్రమే వస్తాయి కేటగిరి 4 తప్పుగా నిర్ధారిస్తే ఒక జూనియర్ కి 40 పాయింట్లు వస్తాయి
ఈ కేటగిరి 4 పాఠశాలను నిర్ణయించడం గత బదిలీలలో ఏ ఏ పాఠశాలలు కేటగిరి 4 లో ఉన్నాయి అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది గత బదిలీలలో 2023 ఉన్న మండలా విద్యాశాఖ అధికారి ప్రస్తుత బదిలీలలో కూడా T నరసాపురం మండలంలోనే పనిచేస్తున్నారు అంతేకాకుండా కేటగిరి 4 విషయం T నర్సాపురం మండలాన్ని గూర్చి 2023లో కూడా బదిలీల సమయంలో వివాదాస్పదమైనప్పుడు ప్రింట్ మీడియాలో న్యూస్ వచ్చినప్పుడు సదరు మండల విద్యాశాఖ అధికారి మల్లప్పగూడెం ఒక పాఠశాల మాత్రమే కేటగిరి ఫోర్ అని ధ్రువీకరించారు
పైన వ్రాయబడినటువంటి లెటర్లో పూర్తిగా బాధ్యత రాహిత్యంగా గత బదిలీలలో T నరసాపురం మండలంలో MPPS మల్లప్పగూడెం పాఠశాల మాత్రమే కేటగిరి 4 అని తెలిసి కూడా పైనుంచి వచ్చినటువంటి పాఠశాలల లిస్ట్ ను పరిశీలించి గత బదిలీలలో ఉన్న పాఠశాలను మాత్రమే కేటగిరి ఫోర్ గా గుర్తించి మార్కులు కేటాయించాలని పై అధికారులు తెలియచేసినప్పటికీ మండల విద్యాశాఖ అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడి పైనుంచి పంపిన పాఠశాలలు అన్నిటినీ కూడా కేటగిరి 4 గా ధ్రువీకరిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి వారికి పంపించారు
ఇది అన్యాయం అని చాలామంది ఉపాధ్యాయులు కంప్లైంట్ చేస్తామని మండల విద్యాశాఖ అధికారిని నిలదీసినప్పుడు నేను దాన్ని సరి చేసుకుంటాను అని జిల్లా విద్యాశాఖ అధికారికి లిఖితపూర్వకంగా T నరసాపురం మండలంలో MPPS మల్లప్పగూడెం ఒక్క పాఠశాల మాత్రమే కేటగిరి..4 అని (సంవత్సరానికి 5 పాయింట్స్)మిగిలిన పాఠశాలలన్నీ కేటగిరి 3 అని (సంవత్సరానికి 3 పాయింట్స్)దానిని సరి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కి పంపియున్నారు
ఈ సంఘటన పొరపాటుగా జరిగినది కాదని ఉద్దేశపూర్వకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి కొందరు ఉపాధ్యాయులకు ఎక్కువ మార్కులు కేటాయించడం జరిగిందని ఉపాధ్యాయులు వాపోతూ ఈ పొరపాట్లను సరిచేసి పాయింట్లను కేటాయించాలని గతంలో అనేక విషయాలలో అనేక విధాలుగా పైరవీలకు పాల్పడినా సహించిన ఉపాధ్యాయులు ఈ విషయంలో సదరు మండల విద్యాశాఖ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుచున్నారు
