భారత్ న్యూస్ తిరుపతి…హనుమంతుడికి ప్రీతికరమైన వారం………..!!
హనుమంతుడు శనివారం నాడుజన్మించాడట. ఆ
రోజు హనుమంతుని భక్తులు ఆంజనేయున్ని
విశేషంగా పూజలు చేస్తారు.పురాణాలలో కూడా
హనుమంతుడిని శనివారం పూజించమని
ఘోషిస్తున్నాయి. సాధారనంగా
మనం హనుమంతుడిని మంగళవారం పూజిస్తాము. కానీ ఆంజనేయుడికి శనివారం చాలా ఇష్టమైన రోజట.
“సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ
పరాక్రమః”

అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి
పరాక్రమవంతుడు అయ్యాడు అనిఅర్ధం. శ్రవణా
నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకంచేయాలి.
తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడుఅని పురాణాలు చెప్పబడింది. అభిషేకం చేస్తే అనుగ్రహ
ప్రాప్తి కలుగుతుంది.
వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కలిగి మిత్రసమృద్ధి పెరిగి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు. హనుమంతుని పూజించడం వల్ల మనోధైర్యం పెరిగి
వృత్తివ్యాపారాల్లో రాణిస్తారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర,
వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా, కార్తీక శుద్ధద్వాదశినాడుశనివార వ్రతం చేయాలి.
శనివారవ్రతవిధానం : ఉదయమే లేచి
స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో
బయటినుండి నీరు తెచ్చుకొని హనుమంతునికి
అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా
చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే
అనుకున్న కార్యాలుదిగ్విజయంగా
పూర్తవుతాయని పురాణాలలో పేర్కొనబడింది.
శనివారవ్రతానికి మరొక కారణం కూడా చెబుతారు.
శనిగ్రహ అధిపతి శనీశ్వరుడు ఎంత
క్రూరస్వభావుడో అంతటిసౌమ్యమూ కలిగినవాడు.
ఒకసారి శనీశ్వరుడు హనుమంతున్ని సమీపించి
“మారుతీ! నేను శనిని, అందర్ని పట్టి బాధించాను.
ఇంత వరకు నిన్ను పట్టుకోలేదు.
ఇప్పుడుచిక్కావు.” అన్నాడు.
దానికి హనుమ “శనీశ్వరా! నన్ను పట్టుకొంటావా?
లేకనాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా వుంది?” అనిప్రశ్నించాడు. అప్పుడు శని, హనుమంతుని శిరస్సు మీద ఉంటానని చెప్పాడు.సరేనని శిరస్సు మీద శనిని
పెట్టుకొన్నాడు హనుమంతుడు. ఆంజనేయుడికి
శనీశ్వరుడినిబాధించాలని మనసులో కోరిక మెదిలింది.
ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకుఎత్త
ు కున్నాడు.
ఆ భారం తట్టుకోలేని శనీశ్వరుడు కుయ్యో మొర్రో
అంటూ గిలగిల తన్నుకున్నాడు,
బరువు దించమని హనుమంతుడిని ప్రాధేయ
పడ్డాడు. జాలి కలిగిన హనుమంతుడు పర్వతాన్ని
విసిరేసి శనీశ్వరుడిని తోకకు చుట్టుకునిసేతువ
ుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు.
ఊపిరాడక శని వలవల ఏడ్చేశాడు.తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ,
ఏడుస్తూ ప్రార్ధించాడు.
శని స్తోత్రాలకు ఆంజనేయుడు సంతోషించి
“మందా! నన్ను పట్టుకొనిపీడిస్తానని
ప్రగల్భాలు పోయావు. అప్పుడే గిజ గిజలాడి
పోతున్నావే?” అనిప్రశ్నించాడు.
“ప్రజలను బాధించటమే నీ ధర్మంగా
ప్రవర్తిస్తున్నావు. అందుకనినిన్ను ఒక రకంగా
శాసించి వదిలి పెడతాను, సమ్మతమేనా?” అని
అడిగాడు హనుమంతుడు. గత్యంతరం లేని
శనీశ్వరుడుసరేనన్నాడు.
హనుమంతుడు “శనీశ్వరా! నా
భక్తులను బాధించ కూడదు,
నన్ను పూజించేవారిని, నా మంత్రాన్నిజపించేవారిని,
నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నాదేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసే వారిని ఏ కాలంలోనైనా ముట్టుకోకూడదు, బాధించరాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్నుదండిస్తాను” అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలి పెట్టాడు.అందుకే శనివారానికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది.
శనిని తోకతో నేల మీదపడేసి లాగటం వల్ల శనీశ్వరుడి శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధా నివృత్తికే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారినిశనిదేవుడు బాధించడు అనిపండితులు అంటున్నారు. ముల్లోకాలలోని దేవతలను పట్టి పీడించిన శనీశ్వరుడిని ఆంజనేయుడు ముప్పుతిప్పలు పెట్టాడు.
భక్తులు కనీసం వారంలో ఒకరోజైనా హనుమంతుడి
దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరిస్తే శనీశ్వరుడు పీడించకుండా ఉంటాడు.
భక్తులు మండల పూజలు చేసినా శనీశ్వరుడు దరిచేరడు.
ఆంజనేయం మహావీర్యం బ్రహ్మవిష్ణు శివాత్మకం !
తరుణార్కప్రభోశాంతం రామదూతం నమామ్యహమ్ !!