వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 18 నెలల పాపను గోడకేసి కొట్టి చంపిన ప్రియుడు

భారత్ న్యూస్ విజయవాడ…వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 18 నెలల పాపను గోడకేసి కొట్టి చంపిన ప్రియుడు

విజయవాడ సమీపంలోని గన్నవరంలో ప్రేమ వివాహం చేసుకుని ఐదేళ్ల బాబు, 18 నెలల పాపతో నివసిస్తున్న దంపతులు

తన భర్త స్నేహితుడు కనిజం వంశీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని స్థానికంగా ఓ గదిని అద్దెకు తీసుకుని పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి అతనితో సహజీవనం చేయడం మొదలుపెట్టిన సదరు మహిళ

పాపతో కలిసి ఒక రోజు వంశీ గదికి వెళ్లిన క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగి, 18 నెలల పాపను దారుణంగా గోడకేసి కొట్టిన ప్రియుడు వంశీ

పాప అక్కడికక్కడే చనిపోవడంతో భయపడి అత్తా మామలకు విషయం చెప్పిన మహిళ

ఎక్కడున్నావని వారు అడగగా, మహిళ పొంతన లేని సమాధానం చెప్పడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో గాలిస్తుండగా, చుట్టుగుంట సమీపంలో చనిపోయిన పాపతో నిందితులను గుర్తించి వారిని పోలీసులకు అప్పగించిన కుటుంబ సభ్యులు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే పాపను హతమార్చినట్లు పోలీసుల అనుమానం

అయితే వంశీ గతంలో పోక్సో కేసులో రెండు నెలలు జైల్లో ఉన్నాడని, అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నట్లు గుర్తించి, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు