భారత్ న్యూస్ విజయవాడ…బెట్టింగ్ కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతున్న కృష్ణాజిల్లా పోలీసులు
క్రైమ్ న్యూస్ కృష్ణా :
ఐపీఎల్ సందర్భంగా జరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాల వల్ల అనేక మంది యువత అప్పుల బారిన పడుతున్నారని, ఆ క్రమంలో వాటి నుండి బయటపడలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తద్వారా వారిపైనే ఆధారపడిన, ఆశలు పెంచుకున్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని కాబట్టి బెట్టింగ్ నిర్వాహకుల పైన, బెట్టింగ్‌లో పాల్గొనే వారి పైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు, ఈ బృందాలు స్థానిక పోలీసులతో సమన్వయంగా పని చేస్తూ బెట్టింగ్ నిర్వాహకులు మరియు పాల్గొనేవారిపై ఉక్కుపాదం మోపనున్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యా సాగర్ నాయుడు ఐపీఎస్ గారు హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు మేరకు బెట్టింగ్ నివారణా చర్యల్లో భాగంగా ఈరోజు అనగా 24.4.2026న గన్నవరం ఇంచార్జ్ డిఎస్పి శ్రీ పాల శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఉయ్యూరు సీఐ టీ.వీ.వీ రామారావు బృందం ఉయ్యూరులో పలుచోట్ల దాడులు నిర్వహించి బెట్టింగ్ నిర్వాహకులను మరియు దానిలో పాల్పంచుకుంటున్న 1.కూరాడ రాంబాబు (35)
2.కొండపాటి జగదీష్ (23)
3.సత్తివాడ సంపంత్ కుమార్ (29)
4.భూరెల రవి కుమార్ (33)
5.వడ్డిపల్లి సురేష్ బాబు (43)
6.కుమరాపు వినయ్ కుమార్ (23)
7.రొండ పేర్రెడ్డి (57)
8.గుండపు వేణు (30) మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి ఫోన్లను సీజ్ చేయడం జరిగింది.
పరారీలో ఉన్న మరో నలుగురు
1) .మారదని ప్రసాద్
2) .బతుల నాగ దుర్గా ప్రసాద్
3) .కొండపల్లి హరి
4) .పండ్రాజు సత్యనారాయణ లతో సహా 12 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి వారి నుండి సేకరించిన సాంకేతిక సమాచారం మరియు బ్యాంక్ లావాదేవీల ఆధారంగా మిగిలిన ముద్దాయిలను గుర్తించే ప్రక్రియ జరుగుతుంది

ఉయ్యూరు మరియు పరిసర ప్రాంతాల్లో బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసిన పక్షంలో వెంటనే 9440627047 నంబర్‌కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఉయ్యూరు సీఐ శ్రీ టీవీవీ రామారావు సూచించారు