భారత్ న్యూస్ విశాఖపట్నం..డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణం
AP: కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ ‘స్త్రీనిధి’ పథకం కింద అర్హులైన మహిళా సభ్యులకు ద్వారా గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించనున్నారు. ఈ రుణానికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదా డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఉండవు. ఎటువంటి హామీ లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే నగదు నేరుగా సభ్యురాలి ఖాతాలో జమ అవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 వేల కోట్లు కేటాయించింది.
