ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టిన విషయం విదితమే..

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టిన విషయం విదితమే..

తాత్కాలికంగా డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాల కోసం బయటి వ్యక్తులను అపాయింట్ చేస్తోంది యాజమాన్యం..!

అయితే తమ సమ్మెకు ఇబ్బంది కలిగించేలా యాజమాన్యం చేస్తున్న చర్యలపై ఉద్యోగుల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది..

ఇందులో భాగంగా తాత్కాలిక డ్రైవర్లను ఆర్టీసీ విధుల్లోకి రావొద్దని.. ఇంకేదైనా పని చూసుకోవాలని.. మీకు అర్హత ఉంటే సమ్మె ముగిసిన తర్వాత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జేఏసీ ప్రతినిధులు సర్ది చెబుతున్నారు.. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలో మీరు భాగస్వాములు కావద్దని సూచిస్తున్నారు..

రామ్ నగర్ లోని డిపో సమీపంలో వీఎస్టీ వద్ద మూడవ నెంబర్ రూట్ లో వెళ్లేందుకు డిపో నుండి బయలుదేరిన బస్సును ఆపి డ్రైవర్ కు హితబోధ ఇలా హితబోధ చేసారు…