బంగారు రుణాలపై ఆర్బీఐ కీలక ప్రకటన

భారత్ న్యూస్ కడప ..బంగారు రుణాలపై ఆర్బీఐ కీలక ప్రకటన

బంగారం తాకట్టు రుణాల పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ, శనివారం తుది మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా రూ.2.5 లక్షల లోపు రుణాలపై లోన్‌ టు వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని 75 శాతం నుండి 85 శాతానికి పెంచుతూ కీలక మార్పులు చేసింది.

అయితే రుణాల రిస్క్‌ను తగ్గించేందుకు అనేక నియంత్రణలను కూడా కలుపుకొంది. ఆర్‌బీఐ బంగారం, వెండి తనఖాపై రుణం మార్గదర్శకాలు 2025’ ప్రకారం.. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలకు ఎల్‌టీవీ నిష్పత్తిని 80 శాతంగా నిర్ణయించింది.

రూ.5 లక్షలకు పైగా రుణాలకు మాత్రం ఎల్‌టీవీ నిష్పత్తి 75 శాతంగా కొనసాగనుంది. బ్యాంకులు లేదా గోల్డ్‌ లోన్‌ కంపెనీలు రుణాలు మంజూరు చేసేందుకు ఈ నిష్పత్తే ఆధారం. రుణగ్రహీత తాకట్టు పెట్టే బంగారం నికర విలువలో ఆ రోజున రుణ మంజూరుకు అర్హత శాతమే ఎల్‌టీవీ నిష్పత్తి…

బుల్లెట్‌ రీపేమెంట్‌ లోన్స్‌ విషయానికొస్తే, ఎల్‌టీవీ మదింపులో రుణ కాలప రిమితి ముగిసేనాటికి తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని (అసలు+వడ్డీ) పరిగణ నలోకి తీసుకుంటారు సందేహాలుంటే… తనఖా కింద స్వీకరించే బంగారం లేదా వెండి విలువను ఆ లోహం స్వచ్ఛత ఆధారిత