Hon’ble Prime Minister to flag off Malda Town – Bangalore Amrit Bharat Express via Vijayawada Division

.భారత్ న్యూస్ విజయవాడ,,

విజయవాడ డివిజన్ మీదుగా మాల్దా టౌన్ – బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ని జెండా ఊపి ప్రారంభం చేయనున్న గౌరవప్రదమైన ప్రధాన మంత్రి

  • నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు దక్షిణ మధ్య రైల్వేలోని పదకొండు స్టేషన్లలో స్టాపే అందించబడింది
    గౌరవనీయులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 30 , 2023న అయోధ్య నుండి రిమోట్ వీడియో లింక్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ మీదుగా మాల్దా టౌన్ – శ్రీ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినస్ ( బెంగళూరు) అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ రైలును జెండా ఊపి ప్రారంభం చేయనున్నారు. అయోధ్యలో జరిగే కార్యక్రమంలో ప్రధాని దేశంలోని సూపర్‌ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లలో కొత్త కేటగిరీ-అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్-ని జెండా ఊపి ప్రారంభం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు రైల్వే అధికారులు కూడా పాల్గొంటారు.
    అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ప్రవేశం దేశంలో రైలు ప్రయాణాన్ని ఆధునీకరించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. వినూత్నమైన పుష్-పుల్ విధానం ప్రయాణీకులకు వేగం, సామర్థ్యం, సౌకర్యం మరియు స్థోమత యొక్క ప్రత్యేక సమ్మేళనాన్ని అందిస్తుంది. మొదటి ప్రయత్నంలో రెండు కొత్త రైళ్లు ప్రవేశపెట్టబడుతున్నాయి; అయోధ్య ధామ్ జం. – దర్భంగా & మాల్దా టౌన్-బెంగళూరు. ఇవి రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు నిరంతరాయ మరియు ఆనందించే ప్రయాణాన్ని అందిస్తాయి.
    నూతన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళుతుంది మరియు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ మీదుగా పదకొండు స్టేషన్లలో స్టాప్ అందించబడింది. ఇందులో తుని , సామర్లకోట , రాజమండ్రి, ఏలూరు , విజయవాడ, తెనాలి , చీరాల , ఒంగోలు , నెల్లూరు, గూడూరు మరియు రేణిగుంట మొదలైన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు విభాగంలోని ప్రయాణీకులకు వేగవంతమైన, అనుకూలమైన, సురక్షితమైన మరియు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది.
    రైలు ప్రయాణికులకు అందమైన మరియు ఆకర్షణీయమైన డిజైన్ సీట్లు, మెరుగైన లగేజీ ర్యాక్, తగిన మొబైల్ హోల్డర్‌తో మొబైల్ ఛార్జింగ్ పాయింట్, ఎల్.ఇ.డి లైట్లు, సీ.సీ.టి.వీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి మెరుగైన సౌకర్యాలను ఈ రైలు అందిస్తుంది. అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ అనేది నాన్-ఎసి స్లీపర్ కమ్ అన్‌రిజర్వ్‌డ్ క్లాస్ సర్వీస్. ఇది తక్కువ ఖర్చుతో మరియు ఎక్కువ దూరాలకు సేవలందించేలా రూపొందించ బడింది. మాల్దా టౌన్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ సరసమైన ఖర్చుతో మెరుగైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికలను అందించడం ద్వారా ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుంది.