Achieving new standards in South Central Railway in the term of development with dedication and excellence of staff

భారత్ న్యూస్ హైదరాబాద్…

సిబ్బంది అంకిత భావం మరియు అత్యుత్తమ పనితీరుతో అభివృద్ధి పదంలో దక్షిణ మధ్య రైల్వేలో నూతన ప్రమాణాల సాధన

  • దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ అరుణ్‌కుమార్‌ జైన్‌
  • ఉత్తమ పనితీరుకు గాను 77 సిబ్బంది/అధికారు లకు విశిష్ట్ రైల్ సేవా పురస్కార్ అవార్డులు మరియు డివిజన్ & డిపార్ట్మెంట్ లకు 36 ఎఫిషియెన్సీ షీల్‌్ధల ప్రదానం దక్షిణ మధ్య రైల్వే 68వ రైల్వే వారోత్సవాలను ఈరోజు అనగా డిసెంబర్ 22, 2023న సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో నిర్వహించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ అరుణ్‌కుమార్‌ జైన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని డివిజన్‌లకు జోనల్‌ ఎఫిషియెన్సీ షీల్‌్ిలను, అధికారులు & సిబ్బందికి వ్యక్తిగత విశిష్ట్ రైల్ సేవా పురస్కార్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ ఆర్.ధనంజయులు, దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ అరవింద్ మల్ఖేడే, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎ.శ్రీధర్, వివిధ శాఖల ప్రిన్సిపల్ హెడ్స్, డివిజనల్ రైల్వే మేనేజర్లు ఇతర సీనియర్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, 2022-23 సంవత్సరం దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒక ముఖ్యమైన సంవత్సరాలలో ఒకటిగా జోన్ కొత్త మైలురాళ్లను సాధించి, వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పిందని పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ కొన్ని విజయాల గురించి ప్రస్తావిస్తూ , దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్‌వర్క్‌కు 383.85 కిలోమీటర్ల ట్రాక్‌ను జోడించి, అనేక నూతన ప్రాంతాలకు మొదటిసారిగా రైలు అనుసంధాన్ని అందించిందని పేర్కొన్నారు. “మిషన్ ఎలక్ట్రిఫికేషన్” సాధించే దిశగా, జోన్ 2022-23లో రికార్డు స్థాయిలో 1,017 రూట్ కి.మీ.లను విద్యుద్దీకరించింది, ఇది దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒకే ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా చేరిందని ఆయన చెప్పారు. జోన్ తన నెట్‌వర్క్‌లో సామర్థ్యాన్ని పెంపొందించడంలో అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా, జోన్‌లోని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ గోల్డెన్ డయాగోనల్ అలాగే హై డెన్సిటీ రూట్లలో అన్ని మార్గాల్లో గరిష్ట వేగం గంటకు 130 కి.మీకి పెంచబడింది

శ్రీ అరుణ్ కుమార్ జైన్ జనరల్ మేనేజర్, ఓవర్ ఆల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్ సికింద్రాబాద్ & విజయవాడ డివిజన్‌లకు సంయుక్తంగా అందించారు. ఈ షీల్డ్‌ను సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్ మరియు విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ ఎ. నరేంద్ర పాటిల్ అందుకున్నారు.
జోన్‌లోని వివిధ డివిజన్‌లు మరియు వర్క్ షాప్‌లకు జనరల్ మేనేజర్ ఇతర 35 జోనల్ స్థాయి ఎఫిషియెన్సీ షీల్‌్ లను కూడా అందించారు. డివిజన్ వారీగా అందుకున్న షీల్డ్ ల వివరాలు :

  1. సికింద్రాబాద్ డివిజన్: రైలు కార్యకలాపాలు & రన్నింగ్ రూమ్ కోసం జనరల్ మేనేజర్ షీల్డ్;
    ట్రాక్ యంత్రాల యొక్క ఉత్తమ వినియోగం (జాయింట్‌గా); ఉత్తమ ట్రాక్ షీల్డ్ (జాయింట్‌గా); సివిల్ ఇంజనీరింగ్ షీల్డ్; పర్యావరణం & హౌస్ కీపింగ్ షీల్డ్; మెకానికల్ షీల్డ్ (జాయింట్‌గా); ఫిర్యాదుల పరిష్కార యంత్రాగం ఎచ్.ఆర్. డి (గ్రీవెన్స్ రిడ్రెసల్ మెషినరీ షీల్డ్; HRD (పర్సనల్) షీల్డ్; హిందీ (రాజ్‌బాషా) షీల్డ్; ఉత్తమంగా నిర్వహించబడే ఎమ్. ఆర్. వి షీల్డ్ (జాయింట్‌గా) మరియు స్క్రాప్ డిస్‌ప్లోసల్ షీల్డ్ లను సికింద్రాబాద్ డివిజన్ అందుకున్నది.
  2. హైదరాబాద్ డివిజన్ : ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసెస్ షీల్డ్; లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపులో ఉత్తమ డివిజన్ ; ఉత్తమ పాఠశాల; ఉత్తమ డివిజన్కు లభించే రైలు మద్దాద్ షీల్డ్ మరియు ఇన్నోవేషన్స్ షీల్డ్ లను హైదరాబాద్ డివిజన్ అందుకున్నది
  3. విజయవాడ డివిజన్: ఫైనాన్స్ షీల్డ్; కమర్షియల్ షీల్డ్; ఉత్తమ డీజిల్/ఎలక్ట్రిక్ లోకో షెడ్ (జాయింట్‌గా); వర్క్స్ షీల్డ్; వంతెనలు షీల్డ్; ఉత్తమంగా నిర్వహించబడే డెమూ/మెము/ఈ.ఎమ్.యూ. షెడ్ షీల్డ్ ; మెకానికల్ షీల్డ్ (జాయింట్‌గా); ఉత్తమ లోడింగ్ ఎఫర్ట్ షీల్డ్; ఆపరేటింగ్ షీల్డ్ మరియు సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ షీల్డ్ లను విజయవాడ డివిజన్ అందుకున్నది .
  4. గుంతకల్ డివిజన్: స్టేషన్ పరిశుభ్రతకుగాను జనరల్ మేనేజర్ షీల్డ్; ఉత్తమ డీజిల్/ఎలక్ట్రిక్ లోకో షెడ్ (జాయింట్‌గా); ట్రాక్ యంత్రాల ఉత్తమ వినియోగంకుగాను (జాయింట్‌గా); ఉత్తమ ట్రాక్ షీల్డ్ (జాయింట్‌గా); ఉత్తమంగా నిర్వహించబడే సుదూర రైలు మరియు ఉత్తమంగా నిర్వహించబడే ఏ. ఆర్. టి. షీల్డ్ లను గుంతకల్ డివిజన్ అందుకున్నది
  5. గుంటూరు డివిజన్: ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ షీల్డ్; భద్రతా షీల్డ్ మరియు ఉత్తమంగా నిర్వహించబడే ఎమ్. ఆర్. వి షీల్డ్ (జాయింట్‌గా) షీల్డ్ లను గుంటూరు డివిజన్ అందుకున్నది.
  6. మెడికల్ షీల్డ్ : సెంట్రల్ హాస్పిటల్, లాలాగూడకు అందజేయబడింది
  7. మెకానికల్ వర్క్ షాప్ షీల్డ్: తిరుపతి క్యారేజ్ రిపేర్ షాప్ కు అందజేయబడింది
  8. ఉత్తమ స్టోర్స్ డిపో షీల్డ్ : మెకానికల్&జి రాయనపాడు వర్క్ షాప్ మరియు G&S/MFT మెట్టుగూడ (ఉమ్మడిగా) అందుకున్నారు .
  9. సర్వే అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ షీల్డ్‌ : డిప్యూటీ . సీ. ఈ. /సీ/కాజీపేట కు అందజేయబడినది 68 వ రైల్వే వారోత్సవాల సందర్భంగా 77 వ్యక్తిగత అవార్డులను అధికారులు మరియు సిబ్బందికి వారు అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా జనరల్ మేనేజర్ గారు ప్రధానం చేసారు.