Government schools as alternative to corporate schools – MLA Bhumana

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు – ఎమ్మెల్యే భూమన

తిరుపతి నగరం( భారత్ న్యూస్)
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి నెహ్రూ మునిసిపల్ హైస్కూల్లో బుధవారం జగనన్న ఉచిత బైజూస్ ట్యాబ్ లను అందించే కార్యక్రమంలో టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అందించగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ను ఉజ్వలంగా తీర్చిదిద్దుతున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్య మీదనే నాడు నేడు కింద 50 వేల కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. తాను అధికారంలోకి వస్తే విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, విద్యా విధానాల్లో సమూలంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, పాఠశాల ప్రాంగణాలను ఆదర్శప్రాయంగా ఉండాలన్న దృడ సంకల్పం కలిగిన వ్యక్తి జగనన్న అని భూమన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలని, ఉత్తమ పౌరులుగా విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు తీర్చిదిద్దాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగింది జగనన్న పాలనలోనేనని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బసవ గీత, డిఈఓ రాజశేఖర్, ఎంఈఓలు భాలాజీ, నాయక్ పాల్గొన్నారు.