If there is a difference in the stock, it is the responsibility of the supervisors

స్టాకు లో తేడా వస్తే సూపర్ వైజర్ ల దే భాధ్యత

పాకాల (భారత్ న్యూస్ ) ప్రభుత్వ మద్యందుకాణాల లోపని చేసే సూపర్ వైజర్ లు ప్రతి రోజు నిల్వ గల స్టాకు ను సరిచూసు కోవాల ని చిత్తూరు మద్యం డిపో సబ్ ఇన్స్ పెక్టర్ రామకృష్ణ శాస్త్రి సూపర్ వైజర్ ల కు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు మరియు డిపో ఇన్స్ పెక్టర్ లక్ష్మణరావు ఆదేశాల మేరకు బుధ వారం పాకాల మండలంలోని దామలచెరువు లోగల వివిధ ప్రభుత్వ మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొంత మంది సూపర్ వైజర్ లు రోజు స్టాకు ను చూసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నార న్న పిర్యాదులు అందుతున్నాయని అట్టి వారిని గుర్తించి విచా రించి రుజువు అయితే చర్యలు తీసుకోవాలని ఉన్న తాది కారులకు రిపోర్ట్ పంపుతామని ఆయన అన్నారు.బాటిల్ టు బాటిల్ తనిఖీ చేయడం వల్ల సంబంధిత సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయడానికి ఆస్కారం ఉండదన్నారు. నిల్వగల స్టాకును సిబ్బంది సహాయంతో నిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీ లలో ఆయన వెంట వెరిఫికేషన్ ఆఫీసర్లు నాగరాజు, లోకనాథం మరియు సూపర్ వైజర్ లు పాల్గొన్నారు