Students should master Telugu language: MEO 2 Lingaiah

విద్యార్థులు తెలుగు బాష పట్ల పట్టు సాధించాలి: ఎంఈఓ 2 లింగయ్య

పాకాల ( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం
విద్యార్థులు తెలుగు భాష పట్ల చిన్నతనం నుండే పట్టు సాధించాలని తిరుపతి జిల్లా పాకాల మండలం విద్యా శాఖాధికారి 2 లింగయ్య అన్నారు.ఆయన బుధవారం మండలంలోని గుండ్ల గుట్ట పల్లి,పది పుట్ల బయలు తదితర పాఠశాలల్లో అమలయ్యే టీచింగ్ అట్ట్ ద రైట్ లెవెల్(TaRL) కార్యక్రమాన్ని పరిశీలించారు.ఆయన మాట్లాడుతూ 3,4 మరియు 5 తరగతులకు తెలుగు,గణితం లలో ఈ కార్యక్రమము ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు.విద్యార్థులు తెలుగు నందు చదవడం,రాయడం వస్తే చాలు ఆ విద్యార్థి అన్నింటిలో రాణిస్తాడని పేర్కొన్నారు. గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహరం నేర్పించాలని అన్నారు. విద్యార్థులు 20 వరకు ఎక్కాలు నేర్చుకోవాలి అన్నారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు నిరంతరం పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కష్టమైన పదాలను బోర్డ్ మీద రాసి విద్యార్థులను నోట్ బుక్ నందు రాసుకోమని చెప్పాలన్నారు. వారి రాసిన నోట్ బుక్స్ చూశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెంగల్రాయులు,శ్రీనివాస్,సి.ఆర్.పి.శ్రీనివాసులు పాల్గొన్నారు.