Many parts of the state were hit by the severe impact of Cyclone Mig Jam

భారత్ న్యూస్ హైదరాబాద్,మిగ్ జాం తుఫాను తీవ్ర ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి- సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి సూర్యాపేట,నల్లగొండ జిల్లాల్లో కురిసిన వర్షాల వల్ల కళ్ళల్లో ఆరబెట్టిన పంట, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం, కూరగాయల పంటలు టమాట వగైరా తడిసి దెబ్బ తిన్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎగ్జామ్ తుఫాను తీవ్ర ప్రభావంతో దెబ్బతిన్న పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ నూతనంగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా రెండు రోజులపాటు తుఫాను ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించిన తరుణంలో రైతులందరికీ భరోసా ఇస్తూ నష్టపరిహారం ఇస్తామని హామీని ఇవ్వాలని, దెబ్బతిన్న పంటలకు తగు రీతిలో నష్టపరిహారం ఇవ్వాలి. పత్తి మిర్చికి ఎకరాకు రూ. 40 వేలు, వరికి ఎకరాకి రూ.20 వేలు, కూరగాయలకు ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వాలని కోరుతున్నాను. కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే మరియు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.