Let’s protect reservation in the constitution with fighting spirit

భారత్ న్యూస్ హైదరాబాద్,

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను కాపాడుకుందాం
మారుపాక అనిల్ కుమార్
డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
న్యూ ఢిల్లీ:డిసెంబరు 6  :
భారత రాజ్యాంగ నిర్మాత ,దళిత పీడిత జాతుల పోరాట నాయకుడు  బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను  దళిత ప్రజానీకం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్  పిలుపునిచ్చారు .బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం  దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) అద్వర్యం లో అజయ్ భవన్ న్యూఢిల్లీ నిర్వహించడం జరిగింది.ముందుగా ఆయన చిత్ర ప్రటం కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు .ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ న్యాయము, స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాత్వత్వం అనే నాలుగు స్తంభాలపై అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. పటిష్టమైన అతిపెద్దదైన  భారత రాజ్యాంగాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం మార్పు చేసేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. దీనివల్ల ప్రజలకు  సామాజిక న్యాయం, బావ స్వతంత్రం, సమానత్వ లేకుండా అరాచకాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. భారత ప్రజలు అప్రమత్తమై, దేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం మరొకసారి అధికారం లోకి వస్తే రిజర్వేషన్ ఎత్తి వేసే కుట్ర చేస్తారని ఇప్పటికే ప్రభుత్వం రంగం సంస్థలను బడా కార్పరేట్ వ్యక్తులకు అమ్మి వేస్తున్నారని ఆయన విమర్చించారు . ఇప్పటైకైనా దళిత నాయకులు బుర్జవ పార్టీలు విసిరే ఎర లకు లొంగకుండా హక్కుల కోసము పోరాడాలని పిలుపు నిచ్చారు. దళితులను హత్యలు చేసే వారికి వత్తాసు పలకడం దళిత పథకాలను ఎత్తివేయడం దారుణం అన్నారు దళిత వర్గాలను కలుపుకొని అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంపై  పోరాటం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఏ రాజ్ కుమార్, బి లక్ష్మీపతి,  డి రాములు, వేల్పుల శ్రీనివాస్, రూపేష్, భరత్, లింగస్వామి, దయాకర్, భద్రయ్య, నిమ్మల మనోహర్, మద్దిల దినేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.