meaningful science teaching with science kits

సైన్స్ కిట్లతో అర్థవంతమైన విజ్ఞాన శాస్త్ర బోధన భారత్ న్యూస్
ఎచ్చెర్ల, నవంబర్ 18:
విజ్ఞాన శాస్త్ర బోధనలో సైన్స్ కిట్స్ ప్రాధాన్యత ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల విద్యాశాఖ అధికార్లు కారు పున్నయ్య, జి. రాజ్ కిషోర్ అన్నారు.
ఇండియా లిటరసీ ప్రాజెక్టు స్కూల్ రెడీనెస్ , బాలవికాస్ ప్రోగ్రామ్ లో భాగంగా యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్చంద సేవా సంస్థ
ఎచ్చర్ల మండలంలోని ఎచ్చర్ల పోలీస్ క్వార్టర్స్ లోని ప్రభుత్వ పాఠశాలకు, కుశాల పురం దోమాం యూపీ పాఠశాలలకు సైన్స్ కిట్స్ వితరణ కార్యక్రమం శనివారం కుశాల పురం ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాాధికారి కె. పున్నయ్య మాట్లాడుతూ సైన్సు ఎంతో అభివృద్ధి చెందిందని,ఈ సైన్స్ కిట్ వినియోగంతో విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. మండల విద్యాశాఖాధికారి -2 జి. రాజ కిషోర్ మాట్లాడుతూ పాటశాల లోని సైన్స్ కిట్ వలన కలిగే ఉపయోగాలు గురించి తెలియజేశారు. ప్రాజెక్ట్ కమ్యూనిటీ ఆర్గనైజర్ ఆర్. కల్పన మాట్లాడుతూ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించారు. మండల విద్యాశాఖ అధికారులు చేతుల మీదుగా మూడు పాఠశాలల ఉపాధ్యాయులకు సైన్స్ కిట్లను అందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయలు, ప్రాజెక్ట్ కమ్యూనిటీ ఆర్గనైజర్ లు కె.శ్రావణి, ఆర్.కల్పన, పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.