Coochipudi police caught Interstate Bihar robbersTwo persons were arrested and 263 grams of gold was seized from them in 6 casesThe value of these will be around 16 lakhs

కృష్ణాజిల్లా కూచిపూడి:::: ( భారత్ న్యూస్)
*అంతర్రాష్ట్ర బీహార్ దొంగలను పట్టుకున్న కూచిపూడి పోలీసులు
ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద 6 కేసులలో 263 గ్రాముల బంగారం స్వాధీనం
వీటి విలువ సుమారు 16 లక్షలు ఉంటుంది అన్న
కృష్ణాజిల్లా ఎస్.పి. కూచిపూడి ఎస్సై సందీప్ మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ జాషువా,,ది 28.3.2023 మొవ్వ మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపూడి గ్రామ శివారులో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి ఇంటిలో ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి , బంగారం వెండి వస్తువులు మెరుగు పెడతామని నమ్మించి , ఆ మహిళ వద్ద ఉన్న బంగారపు వస్తువులను మెరుగు పెడతామని తీసుకొని , ఒక నీటిలో వేసి , కొంచెం పసుపు తీసుకురమ్మని ఆమెకు చెప్పి , ఆమె లోపలికి వెళ్లే సమయంలో ఈ బంగారపు వస్తువులను దొంగిలించి , అక్కడి నుంచి పారిపోయినారు..
దీనిపై కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది…
దీనిలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు గుడివాడ డి.ఎస్.పి. పి శ్రీకాంత్ పర్యవేక్షణలో పామర్రు సీ.ఐ. వి.సుభాకర్ దిశా నిర్దేశకత్వంలో , కూచిపూడి ఎస్సై సందీప్ మరియు సిబ్బంది రెండు బృందాలుగా,విచారణ లో భాగం గా వివిధ కోణాలలో.
దర్యాప్తు చేసి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అన్ని కోణాలలో విచారణ కొనసాగించి ముద్దాయిలను ది 17.12. 2023 సాయంత్రం 6 గంటలకు కూచిపూడి శివారు బార్లపూడి రోడ్ లో పెట్రోల్ బంక్ వద్ద అరెస్టు చేసి విచారించగా వీరు మొత్తం 3 జిల్లాలలో అనగా కృష్ణా , ఎన్టీఆర్ , కోనసీమ జిల్లాలలో 6 నేరాలు చేసినట్టు ఒప్పుకోన్నారని,
ముద్దాయిలు

  1. దీపక్ కుమార్ తండ్రి ఉపేంద్ర సాహూ 38,, భాగల్పూర్ జిల్లా బీహార్ రాష్ట్రం.2. జగన్నాథ్ షాహు తండ్రి ఛాని షాహు , 33,భగల్పూర్ జిల్లా ,
    బీహార్ రాష్ట్రం
    వీరు బీహార్ కి చెందినవారు , వీరు కృష్ణా , ఎన్టీఆర్ , కోనసీమ జిల్లాలలో మొత్తం 6 నేరాలు చేసారని, వీరిపై గతం లో 2003లో అమలాపురం , రామచంద్రపురం లో అలాగే 2014లో హైదరాబాదులో పలు కేసులు ఉన్నాయి అని,
    వీరి వద్ద నుండి ఒక బైక్ , 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియచేసారు