According to the agencies, Seva Supreme, SSR is extorting crores of rupees from Gurukula’s school

భారత్ న్యూస్ విజయవాడ,

గురుకుల పాఠశాలలో ఏజెన్సీల మాటున కోట్లాది రూపాయలు దండుకుంటున్న సేవా సుప్రీమ్, ఎస్ఎస్ఆర్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలి..

ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఏజెన్సీ ల కింద పనిచేస్తున్న సెక్యూరిటీ స్కావెంజర్స్ లను నెల నెల వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్న సేవా సుప్రీమ్ ఎస్ఎస్ఆర్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలని స్థానిక మండలంలో మీడియా సమావేశం లో ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 13 జిల్లాలలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఆవేదన ఎవరితోనైనా చెప్పితే ఉద్యోగాలు తొలగిస్తామంటూ బెదిరింపులు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వని పరిస్థితి ఇంతజరుగుతున్న ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న అంబేద్కర్ గురుకుల విద్యాశాఖ అధికారులు 2018లో సేవా సుప్రీం, ఎస్ఎస్ఆర్ అనే ఏజెన్సీ కింద సెక్యూరిటీ గార్డ్స్, స్లీపింగ్ స్కావెంజర్స్పనిచేస్తారు కానీ ప్రభుత్వ నిబంధనలను ప్రకారం కాంట్రాక్ట్ బేసిక్ కింద గాని రెగ్యులర్ పోస్టులు కానీ ఏజెన్సీ కింద కానీ వారిని విధుల్లోకితీసుకునేటప్పుడు జాయినింగ్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ తోపాటు ఉద్యోగ భద్రత కోసమై పై తెలిపిన వివరాల మేరకు ఇవన్నీ పాటిస్తారు.కానీ ఈ ఏజెన్సీలు మాత్రం ఇవేవీ పాటించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు, ఎందుకంటే వారు ప్రభుత్వంతో టెండర్లు తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఏమనంటే ప్రభుత్వ ఖజానా వద్ద శాలరీలు విషయమై ఆలస్యం అయినా కూడా ఏజెన్సీ వారు ప్రతి నెల ఒకటో తారీకు జీతాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా ఏజెన్సీ నుండి ప్రభుత్వం సంస్థలకు ఎంప్లాయిస్ ను రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క ఎంప్లాయ్ మీద 4 % పర్సెంట్ కమిషన్ ఏపీ ప్రభుత్వం ఇస్తున్నది ఇదే కాకుండా ప్రతి ఎంప్లాయ్ పేరుతోనూ అక్షరాల 13 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయలు చెల్లిస్తుంది, కానీ సెక్యూరిటీ వారికి కేవలం 8000 రూపాయలు స్లీపింగ్ పనిచేస్తున్న వారికి 7500 రూపాయలు స్కావెంజర్ గా పని చేస్తున్నటువంటి వారికి 8000 రూపాయలు ఇస్తూ ఒక్కొక్క ఎంప్లాయ్ పైన నెలకు 3000 నుంచి 5000 రూపాయల చొప్పున కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు , నెల నెల జీతాలు ఏమైనా వస్తాయా అంటే రావు ఐదు నెలలకు ఆరు నెలలకు బ్రతిమలాడితే కానీ జీతాలు పడని పరిస్థితి, జీతాలు వస్తాయని తెలిసిన వారి దగ్గర అప్పుగా తీసుకొని జీవనం గడుపుతున్నారు ఆటోలో ఛార్జీలకు బైకుల పెట్రోల్ కు అప్పులు చేసి తిప్పలు పడి ఉద్యోగం చేస్తున్న కూడా ఏమాత్రం కనికరం చూపని సేవా సుప్రీం ఎస్ ఎస్ ఆర్ ఏజెన్సీలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇదే కాకుండా ఏ ఎంప్లాయిస్ కైనా కూడా సంవత్సరంలో కొన్ని సెలవు దినాలు ఉంటాయి కానీ ఈ వర్కర్స్ కు మాత్రం సెలవులు రోజులు పాటించరు ఒకవేళ ఎవరైనా ఎంప్లాయిస్ కు వారి కుటుంబాలకు చెందిన వారికి ఆరోగ్యాలు బాగాలేక కుటుంబాల అవసరం నిమిత్తం సెలవు తీసుకుంటే చాలీసాలని జీతములో జీతం కట్ అవుతుంది సహచర ఉద్యోగి సహాయం తీసుకొని బిక్కు బిక్కు మని జీవనం గడుపుతున్నారు, ఇదే కాకుండా ఎవరైనా మహిళ ఉద్యోగి గర్భవతులు అయితే ఆరు నెలల పాటు ఆ మహిళకు జీతాలు ఇవ్వాలని భారత రాజ్యాంగంలో రాసి ఉన్న ఇవ్వనటువంటి పరిస్థితి, ఇదే కాకుండా 2019 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో కూడా ఆరు నెలలు ప్రసూతి సెలవులు ఇస్తూ ఆ మహిళకు జీతాలు ఇవ్వాలని ఏజెన్సీలకు ప్రభుత్వం స్పష్టమైన జీవోలు ఉన్నా కూడా ఇవన్నీ పట్టనట్టు వ్యవహరిస్తున్నా ఎస్ ఎస్ ఆర్ ఏజెన్సీ. కానీ ఈ ఏజెన్సీ వారు మాత్రం ప్రసూతి సెలవులు కూడా ఇవ్వకుండా వారిని తొలగించి కొత్తవారిని నియమించుకోవడం ,వారితో అందినంత దోచుకోవడం జరుగుతున్నది, ఏజెన్సీలవారు కాంట్రాక్టు ఉద్యోగులపై కోట్లాది రూపాయల దండుకోవడంతోపాటు ఎవరైనా కానీ పై తెలిపిన ఏజెన్సీ కింద పని చేస్తున్నటువంటి డిఎం గారిని ఫోన్ చేసి జీతాలు అడుగుతే విధుల్లో నుండి తొలగిస్తామని ముఖంజారీ చేస్తారు ఎందుకంటే వారి అవినీతిని ఏజెన్సీ పెద్దలకు తెలియకుండా మరింత జాగ్రత్తలు ప్రతి జిల్లాలో పనిచేస్తున్నటువంటి డిఎం లు జాగ్రత్తలు తీసుకుంటారు, వీటిపై రాబోయే రోజుల్లో అంబేద్కర్ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ గారి దృష్టికి, అదేవిధంగా లేబర్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే , ట్రేడ్ యూనియన్లను, అంబేద్కర్ గురుకుల పాఠశాల వర్కర్స్ ని కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, మహేంద్ర, మహేష్ తదితులు పాల్గొన్నారు.