Ganesh Award for Different Talents

గణేష్ కు విభిన్న ప్రతిభావంతుల పురస్కారం భారత్ న్యూస్, ఎచ్చెర్ల, డిసెంబర్ 3 శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి రీసు గణేష్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల పురస్కారాన్ని ఆదివారం అందుకున్నాడు. ప్రమాదంలో తన కుడి చేయి కోల్పోయిన గణేష్ డ్రాయింగ్, రైటింగ్ స్కిల్స్ ను ఎడమ చేతితో ప్రదర్శించటం పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి శ్రీనివాసరావు గుర్తించారు.గణేష్ ప్రతిభకు ఆయన తో పాటు డ్రాయింగ్ ఉపాధ్యాయులు కృష్ణమోహన్ మెరుగులు దిద్ది ప్రోత్సాహం అందించారు.గణేష్ లోని ప్రతిభాపాటవాలను జిల్లా అధికారుల దృష్టికి ఉపాధ్యాయులు పారుపల్లి శ్రీనివాసరావు తీసుకుని వెళ్లారు.దీంతో విభిన్న ప్రతిభావంతుల విభాగం ఏ డి కవిత స్పందించి గణేష్ ను విభిన్న ప్రతిభావంతుల పురస్కారానికి ఎంపిక చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతులు విభాగం ఏడి కె. కవిత చేతుల మీదుగా గణేష్ ఈ పురస్కారం క్రింద ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపకను ఆదివారం అందుకున్నాడు. గణేష్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.శ్రీరాములు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి శ్రీనివాసరావు ,డ్రాయింగ్ ఉపాధ్యాయులు కృష్ణమోహన్ , పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.కాగా విద్యార్ధి గణేష్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సాహించిన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, కృష్ణ మోహన్ లను జిల్లా విద్యాశాఖ తరపున డీఈఓ వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.