Many teachers, to facilitate the necessary steps to get a prosthetic arm for Ganesh, a third class student with disabilities.

విద్యార్థి గణేష్ కు ఆర్థిక సహాయం భారత్ న్యూస్, డిసెంబర్ 7, ఎచ్చెర్ల , శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ మూడో తరగతి విద్యార్థి దివ్యాంగుడు గణేష్ కు కృత్రిమ చేయ అమర్చేందుకు అవసరమైన చర్యలకు వీలుగా పలువురు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు. ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన గణేష్ రెండు నెలల్లోనే ఎడం చేత్తో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి శ్రీనివాసరావు గుర్తించి మరింత ప్రోత్సహించారు. మంగళగిరిలో గణేష్ కు కుత్రిమ చేయి అమర్చేందుకు సిఫారసు చేశారు .అక్కడికి వెళ్లి వచ్చేందుకు వీలుగా అవసరమైన వ్యయాన్ని అందించేందుకు వీలుగా పలువురు దాతలను శ్రీనివాసరావు సంప్రదించగా వారు స్పందించారు .జె ఆర్ పురం హైస్కూల్ పాఠశాల సిబ్బంది , బివిఆర్ కుటుంబ సభ్యులు 6,000 రూపాయలు, బి.వి.ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఇప్పిలి (బాలి) వాణి 3,000 రూపాయలు, అల్లినగరం హైస్కూల్ ఉపాధ్యాయులు టేకి సుశీల, చదువుల సుశీల 1,000 రూపాయలు మొత్తంగా పదివేల రూపాయలుఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. శ్రీరాములు, విద్యార్థి గణేష్ ,విద్యార్థి తల్లి దుర్గ లకు అందించారు. ఈ నిధులు సద్వినియోగపరుచుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఇప్పిలి వాణి,వావిలపల్లి నిర్మల,టేకి సుశీల, రెహానా భాను, బి.వి.ఆర్, నాగరత్నం ,కృష్ణమోహన్, గోవిందరావు, సునీత పారుపల్లి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.