To help every farmer affected by typhoon Michong

భారత్ న్యూస్ విజయవాడ,

మిఛాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి.

మిచాంగ్ తుపాన్ వలన నష్టపోయిన ప్రతి రైతుని ఆదు కునెందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాణ, పశు నష్టం లేకుండా తుఫాన్ సమర్థవంతంగా ప్రభుత్వం ఎదురకొన్నాం అని అన్నారు. తుఫాన్ వల్ల కొన్ని ప్రాంతాల్లో పంటలు పడిపోయి రైతులతీవ్రంగానష్టపోయారని,,ప్రస్తుతం అధికారులు నష్టానికి సంబంధించి అంచనాలు రూపొందిస్తున్నారని పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తర్వాత రైతులని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపడతారన్నారు. చంద్రబాబు నాయుడు లాగా తుఫానులను దారి మల్లెస్తామని,రెయిన్ గన్ ల ద్వారా సాగునీరు అందిస్తామని గొప్పలు చెప్పుకోవడం తమకు రాదని,విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు మాత్రం న్యాయం జరిగేలా చూస్తామన్నారు.పోలవరం కాలువకు కరెంట్ మోటార్లు తన స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారికే దక్కుతుందనీ అన్నారు. రైతులు సమన్య సక్రమంగా సాగునీరు అందేలా చేయటం వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పండాయని చెప్పారు. తుఫాన్ వల్ల రైతులు కొంత నష్టపోయారని చెప్పారు. సమస్య ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే గారు సూచించారు.బుడమేరు వద్ద డ్రైన్ ఆక్రమణకు గురైందని దీనివల్ల మురుగు పోవడం లేదని మా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారి దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి ఆక్రమణ తొలగించినట్లు చెప్పారు.రైతులకు, పేదలకు మంచి జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అందిస్తున్నారని చెప్పారు తుఫాన్ నేపథ్యంలో నూర్పిడి చేసిన ధాన్యంను నిబంధనలు సడలించి కొనుగోలు చేసినట్లు చెప్పారు.తేమ శాతం ఎక్కువగాఉన్నాకొంటున్నామని ,ఆప్ లైన్ లోనూ రైతులు తమ ఇష్టమైన మిల్లులకు ధాన్యం అమ్ముకునెలా వెసులుబాటు కల్పించామని చెప్పారు.ధాన్యం అమ్మకాల విషయంలో రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకున్నారని తెలియజేశారు.