అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

తిరుపతి( భారత్ న్యూస్ ) తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవరోజు శుక్రవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

 వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా వాహన సేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

     ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ  నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం అధిష్టించి  భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.

 ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్,  శ్రీమతి నాగరత్న,

ఏఈవో శ్రీ పార్థసారథి, సూప‌రింటెండెంట్ శ్రీ సోమ శేఖర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ సురేష్, శ్రీ చలపతి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.