Workshop on Crypto Currency Crimes – SP Radhakrishna

క్రిప్టో కరెన్సీ నేరాలపై వర్క్ షాప్ – ఎస్పీ రాధాకృష్ణ

తిరుపతి(భరత్ న్యూస్ )

తిరుపతి కళ్యాణిడ్యాం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ సంబంధిత నేరాల విచారణపై ఒక రోజు వర్క్ షాప్ గురువారం నిర్వహించడం జరిగిందని పోలిస్ ట్రైనింగ్ కాలేజ్ ఎస్పీ రాధాకృష్ణ తెలిపారు. క్రిప్టోకరెన్సీ పరిశోధనల కోసం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు శిక్షణ ఇవ్వాలని చింతన్ శిబిర్లో ప్రధానమంత్రి ఉద్ఘాటించారని తెలుపుతూ, I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమన్వయం, సహకారంతో క్రిప్టోకరెన్సీ నేరాలకు సంబంధించిన కేసులను విజయవంతంగా పరిశోధించడం జరుగుతున్నదని ఎస్ఫి రాధాకృష్ణ వివరించారు. భారతదేశంలోని రాష్ట్రాలు/యూటీలలో క్రిప్టోకరెన్సీ నేరాలకు సంబంధించిన కెపాసిటీ బిల్డింగ్ కోసం, 14C అనేక రాష్ట్రాల్లో పరిశోధనలు, సాక్ష్యాధారాల సేకరణకు సంబంధించిన శిక్షణా సెషన్లను నిర్వహిస్తున్నదని వివరించారు. వివిధరకాల పరిభాషలను అర్థం చేసుకోవడానికి రాష్ట్రాలు/ యూటిల పోలీసులకు సెషన్లను అందిస్తుందని, బ్లాక్చెయిన్ ఇన్వెస్టిగేటర్ల సహాయంతో క్రిప్టోకరెన్సీ నేరాలలో కొత్త విధానం, ట్రెండ్లకు సంబంధించిన పీర్ టు పీర్ లెర్నింగ్ సెషన్లు నిర్వహించడం జరిగిందన్నారు. ఎం.హెచ్.ఎ I4C సంస్థ కు చెందిన ఢిల్లీ, గుజరాత్, యూపీ, తమిళనాడు రాష్ట్రాలకు సంబందించిన సైబర్ క్రైమ్ నిపుణులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని వివరించడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మరియు తెలంగాణ నుండి డిఎస్ఫి, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయికి చెందిన 40 మంది అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారని ఎస్ఫి తెలిపారు. 14C ఎం.హెచ్.ఎ వీర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగినట్లు తిరుపతి పిటిసి ఎస్పీ ఎం.కె.రాధాకృష్ణ తెలిపారు.