Literary artists should be responsible towards the society. PVP Anjani Kumari

భారత్ న్యూస్ హైదరాబాద్..

సాహితీవేత్తలు కళాకారులు సమాజం పట్ల బాధ్యత కలిగి మెలగాలి. పి వి పి అంజనీ కుమారి
హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గాన సభ లో ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ తరఫన నిర్వహించబడిన సినీ గాన లహరి & జాతీయ సాహితీ కళా సేవా ప్రతిభా పురస్కారాలు 2023 కార్యక్రమం చాలా అద్భుతం గా జరిగింది తెలంగాణ కోస్తా కోనసీమ రాయలసీమ కర్ణాటక రాష్ట్రాలనుండి అనేకమంది కవులు కళాకారులు కవులు పండితులు రాజకీయ వేత్తలు సమాజ సేవకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ సి ఎస్ సి కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ శ్రీమతి పి.వి. పి అంజనీ కుమారి మాట్లాడుతూ సాహితీవేత్తలు కళాకారులు సమాజంలో అత్యంత కీలకమైన వ్యక్తులని సమాజం పట్ల వీరు తమ బాధ్యతను అత్యంత చిత్త శుద్దితో నిర్వహించాలన్నారు
జాతికి క్రాంత దర్శులు మార్గ దర్శులు కవులే నని తెలిపారు
వారి ప్రతి సిరా చుక్కా లక్ష మెదళ్ళ కు కదలిక అని సమాజాన్ని మార్చగలిగే శక్తి ఒక్క సాహితీ మూర్తులకు మాత్రమే ఉందని తెలిపారు మరియు సంగీతం, సాహిత్యం నృత్యం చిత్రలేఖనం శిల్పం ఇవి లలిత కళలని , ఇవి దివ్య కళలు దైవ కళలు దైవదత్త కళలని ఇవి అభ్యాసమున సిద్దించేవి కాదని ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం వలన ప్రాప్తించేవని తెలిపారు ఇట్టి కళలను వరంగా పొందిన కళా కారులంతా ఎంతో అదృష్టవంతులని తెలిపారు విశేషించి సాహిత్యం ఆలోచనామృతం అయితే సంగీతం ఆపాత మధురమని తెలిపారు మరియు మానవుని శారీరిక మానసిక రుగ్మతలన్నిటిని సంగీతం నయం చేస్తుందని సంగీతం ఒక ఔషదమని,ఒక సంజీవని అని తెలియ జేశారు నాడు సంగీతము ను ఆరాధించి నందువలననే ఎన్నో లోకాలు దేవలోకాలయ్యాయన్నారు
సంగీతాన్ని తమ పిల్లలకు నేర్పిస్తున్న ప్రతి తల్లి దండ్రులు తమ గృహారామము ను ఒక దేవలోకాన్ని చేసుకున్నట్లే యని తెలియజేశారు
ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఇందిర గారు మరియు దర్శకులు నిర్మాత నటులు గాయకులు అయిన డాక్టర్ విల్సన్ గారు సంయుక్తం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సంగీత సాహిత్య సామాజిక రాజకీయ రంగాలలో విశిష్ట మైన సేవలు ఒనరించిన ప్రముఖులకు బంగారు నందులను ప్రతిభా పురస్కారాలను అంద జేశారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇందిర గారికి రాష్ట్ర కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు గారికి అమెరికాలోని ఒకానొక ప్రసిద్ధ విశ్వవిద్యాలయo వారిచే డాక్టరేట్ డిగ్రీ లను బహూకరించడం జరిగింది ఉదయం నుండి సాయంకాలం వరకు అనేక గాయక గాయనీ మనులు తెలుగు హిందీ భాషలలో సుప్రసిద్ధమైన పాటలను ఆలాపించి సభను
సమ్మోహనం చేశారు
ఈ సభకు వ్యాఖ్యాతగా నారాయణస్వామి మరియు శ్రీనివాస నాయుడు వ్యవహరించారు ఈ సభలో సుప్రసిద్ధ సినీ నటులు గౌతమ్ రాజు మరియు పసునూరి శ్రీనివాసులు డాక్టర్ టైటాన్ గొర్లే, కృష్ణంరాజు, హాస్యబ్రహ్మ శంకరనారాయణ,గాయకులు తరుణ్ మెహతా త్రినాథ్ రావు శ్రీనివాస్ సురేష్ కుమారి వైష్ణవి జ్యోతి శారద జ్ఞాన సుందరి విజయవాడ మరియు ఆనంద రెడ్డి యువతేజం ట్రస్ట్ కరీ ముల్లా డాక్టర్ రాధా కుసుమ నోరి దంపతులు సుకన్యా విల్సన్ మొడలుగా గల వారు పాల్గొని సభను జయప్రదం చేశారు