Journalism-Journalists Books for ANU Library

ఏ.ఎన్.యూ లైబ్రరీకి జర్నలిజం- జర్నలిస్టులు పుస్తకాలు బహూకరణ.

ఆచార్య నాగార్జున యూని వర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డా.జి అనిత మరియు వర్సిటీలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చీఫ్ లైబ్రేరియన్ విజయ్ కుమార్ ని బుధవారం సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం వర్సిటీలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతనెల 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాను రాసిన జర్నలిజం- జర్నలిస్టులు పుస్తకం ఆవిష్కరణ జరిగినట్లు వర్సిటీ లైబ్రేరియన్ విజయ్ కుమార్ కి గుర్తు చేయడం జరిగింది.అలాగే ఈ పుస్తకం ఆవిష్కరణ చేసిన ముఖ్య అతిధులలో డాక్టర్ జి.అనిత ఒకరు అని ఆమె తమ గురువులలో ఒకరని రాజారత్నం అన్నారు.ఈ సందర్భంగా వర్సిటీలో వారి విభాగాలలో స్వయం గా ఇరువురుని కలసి జర్నలిజం- జర్నలిస్టు లు(పరిశోధనాత్మక కధనాలు) అనే ప్రత్యేక పుస్తక కాపీలను అందిం చారు.తాను వర్సిటీలో జర్నలిజం కోర్స్ చదివిన రోజుల్లో ఆ విభాగానికి చెందిన పుస్తకాలు అందు బాటులో ఉండేవి కాదని ఆయన అన్నారు.

     అయితే ఈ పుస్తకం జర్నలిజంలోకి రావాలని అనుకునేవారికి,వచ్చిన వారికి,జర్నలిజం చదువు కుంటున్న వారికి అసలు మీడియా రంగం ఇప్పుడు ఎలా ఉంది అనేది వివరం గా తెలియజేస్తుందని, జర్నలిజంపై ఆశక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదివి జర్నలిజం-జర్నలిస్టు లుపై ఓ అవగాహన చేసుకోవాలని పుస్తక రచయితగా సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం అన్నారు.

జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో గల లైబ్రరీలో వర్సిటీ గ్రంధాలయంలో ఈ పుస్తకాలు అందుబాటులో ఉంచాలని రాజారత్నం పుస్తకాలను బహూకరిం చారు.