నకిలీ 500 రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న పుంగనూరు (చిత్తూరు) ముఠా ను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,,,

నకిలీ 500 రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న పుంగనూరు (చిత్తూరు) ముఠా ను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

విశ్వసనీయ సమాచారం మేరకు SOT శంషాబాద్‌ టీం మరియు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలోని మెహఫిల్‌ రెస్టారెంట్‌లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లు గంగరాజా మరియు అభినందన్ అని, వారు చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు వస్తవ్యులని, 500 రూపాయల నోట్ల కట్టలలో కింద మీద అసలు నోట్లు పెట్టి మధ్యలో నకిలీ నోట్లు పెట్టి మోసం చేస్తుంటారని తెలిపారు. వారి వద్దనుండి 6.62 లక్షల విలువ చేసే 500 రూపాయల 10 కట్టలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

విచారణలో.
👉🏻 ఇద్దరూ చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందినవారు.
👉🏻 ఈ కేసులో గంగరాజు ప్రధాన నిందితుడు
👉🏻 అభినందన్‌ 2nd నిందితుడు
👉🏻 గంగరాజు స్టాక్ బ్రోకరేజ్ బిజినెస్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బు పోగొట్టుకున్నాడు. అందుకే సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు
👉🏻 2 నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన సచివ్ పవార్ & సురేష్ పవార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన నకిలీ కరెన్సీ వీడియో ను చూసి, వారిని సంప్రదించి Vedio కాల్స్ ద్వారా నిర్ధారించుకున్నారు.
👉🏻 వారు నకిలీ 500 రూపాయల నోట్లను 1:5 నిష్పత్తిలో సరఫరా చేస్తారు.
👉🏻 కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లోని ఛద్వేల్‌కు వెళ్లి సచివ్ పవార్ & సురేష్ పవార్‌లను కలుసుకుని మార్కెట్‌లో పరీక్షించడానికి నమూనాగా 10 నకిలీ నోట్లను కొనుగోలు చేసి సికింద్రాబాద్ కు చేరుకుని ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఒక లక్కీ అనే వ్యక్తి కి 5 నోట్లు ఇచ్చి మార్కెట్లో మార్పిడి చేయించి, సులభంగానే మారుతున్నాయని గ్రహించాడు.
👉🏻 గంగా రాజ 3.5 లక్షలు పొగు చేసుకుని ఇద్దరూ బెంగుళూరు, సూరత్‌, నందుర్ బార్ మీదుగా మహార