భారత్ న్యూస్ రాజమండ్రి….సజ్జల కనుసన్నల్లో వైసీపీ ప్రభుత్వం నడిచింది: హోంమంత్రి అనిత
Jun 02, 2025,
సజ్జల కనుసన్నల్లో వైసీపీ ప్రభుత్వం నడిచింది: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి అనిత అన్నారు. గతంలో సీఎం చంద్రబాబు అమరావతికి వెళ్తే రాళ్లు విసిరి భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారని గుర్తు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ చెప్పలేదా? అని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖ సీఎం, హోంమంత్రి చేతుల్లో లేదని.. సజ్జల కనుసన్నల్లోనే జగన్ ప్రభుత్వం నడిచిందన్నారు.
