భారత్ న్యూస్ విశాఖపట్నం..గాజువాక జీవీఎంసీ పరిధిలో పురప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నీటి పన్నులు మరియు ఆస్తి పన్నులు సంబంధించిన వివిధ అంశాలపై గాజువాక ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి మరియు గాజువాక జోనల్ కమిషనర్ గార్లకు చాలా సంవత్సరాల నుండి గాజువాక ప్రజలు నీటి పన్నులు మరియు నివాస గృహాలు పన్నులు సంబంధించిన వివిధ తప్పిదాలకు సంబంధించిన అంశాలను తక్షణమే సరి చేయమని మరియు గాజువాక పరిధిలో గృహాలలో కుటుంబ పోషణ నిమిత్తం నడుపుకుంటున్న చిన్నచిన్న వ్యాపారాత్మకమైన షాపులు గల గృహాలకు ఉండే కొళాయి పన్నులు కమర్షియల్ పన్నులుగా కాకుండా డొమెస్టిక్ గా మార్చమని పన్నులు పాత పద్ధతిలోనే ఉండాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
అదేవిధంగా.. జీవీఎంసీ గాజువాక పరిధిలో డోర్ నెంబర్ కరెక్షన్,పేరులో అక్షరాలు తప్పుగా పడిన, ఇంటి పన్ను ఎక్కువగా వస్తున్న,జనరల్ రివిజన్, టైటిల్ ట్రాన్స్ఫర్,టాక్స్ ఎగ్జింప్షన్,బైఫరకేషన్ తదితర సమస్యల పరిస్కారం కోసం గాజువాక ప్రజలు 25-04-2026 నుండి 30-04-2026 వరుకు వినతులు తీసుకుంటున్నారు కావున గాజువాక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని నివాస్ వార్వ మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు తెలిపారు.
