విజన్ కలిగిన విజనరీ నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విజన్ కలిగిన విజనరీ నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ కలిగిన విజనరి నేత అని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు, VVR ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కొనియాడారు.

చల్లపల్లి మండలంలోని పాగోలు గ్రామంలో గల ఎన్టీఆర్ మోడల్ పాఠశాలలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను పండగ వాతావరణంలో వైభవంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ మధుసూదనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకల కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విక్కుర్తి శ్రీనివాస్, అతిథులుగా ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు, తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

తొలుత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రతిమకు పూలమాలలతో నివాళులు అర్పించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును ట్రస్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, విక్కుర్తి శ్రీనివాస్, అట్లూరి నారాయణరావులు కట్ చేసి, విద్యార్థులకు తినిపించారు.

పలువురు వక్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత విశేషాలను, ఎదుర్కొన్న సవాళ్లను, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కృషిని కళ్లకు కట్టినట్లు విపులంగా వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని విక్కుర్తి శ్రీనివాస్ ఎన్టీఆర్ స్కూల్ ల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు స్వీట్లతో పాటు పలు రకాల తినుబండారాల కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు స్వీట్లతో కూడిన కిట్లను అందజేసిన విక్కుర్తి శ్రీనివాస్ కు ఈ సందర్భంగా పలువురు ధన్యవాదాలు తెలిపారు.

పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటి, వాటిని సంరక్షించవలసినదిగా సిబ్బందికి సూచించారు.

కార్యక్రమంలో నారా లోకేష్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు, మేకావారిపాలెం పిఎసిఎస్ చైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ, విక్కుర్తి రాంబాబు, విక్కుర్తి శ్రీనివాస్ సతీమణి జయలక్ష్మి, కుమార్తె విక్కుర్తి తులసి, పెదప్రోలు పిఎసిఎస్ చైర్మన్ నాదెళ్ల శరత్ చంద్రబాబు, మేకా శ్రీనివాసరావు లతో పాటు సిబ్బంది, పలువురు ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.