భారత్ న్యూస్ రాజమండ్రి…Ammiraju Udaya Shankar.sharma News Editor…స్వార్థపరుల కబంధహస్తాల్లో పర్యాటక శాఖ ఫుడ్ కోర్ట్ భవనం
ఫుడ్ కోర్టా??? అనధికార పార్టీ కార్యాలయమ??
అనధికార కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఫుడ్ కోర్ట్
నాగాయలంక శ్రీ రామ పాద క్షేత్రం పుష్కర ఘాటు వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నాగాయలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఫుడ్ కోర్ట్ భవనం నాగాయలంకలో పెద్దలుగా చలామణి అవుతున్న కొంతమంది శక్తుల కబంధహస్తాల్లో బందీగా మారిందా????
ప్రభుత్వాలు మారినా, నాయకులు మారిన నాకు మోక్షం లేదా అంటూ కంటతడి పెడుతున్న ఫుడ్ కోర్టు భవనం.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భవనం నిర్మాణం ప్రారంభ సమయంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే , ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ నాగాయలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి దివిసీమ ఖ్యాతిని నలుదిసేలా వ్యాపింప చేసే ఉద్దేశంతో , దివి సీమ మత్స్యకార సాంప్రదాయ రుచులను పర్యాటకులకు అందిస్తూ, పర్యాటకులు సేద తీరేందుకు ఏర్పాటుచేసిన ఫుడ్ కోర్టు భవనం నెలకొల్పిన ఉద్దేశాన్ని పెడదారి పట్టిస్తూ, నాగాయలంకలో పెద్దలుగా చలామణి అవుతున్న కొంతమంది స్వప్రయోజనాల కోసం గత కొన్ని సంవత్సరాలుగా వాడుకుంటూ వస్తున్న పరిస్థితి.
నిర్మాణ అనుమతులు తెచ్చి ప్రారంభించిన అదే శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫుడ్ కోర్ట్ భవనాన్ని పెద్దలుగా చలామణి అవుతున్న స్వార్థపరుల కబంధహస్తాల నుంచి విడిపించి భవన నిర్మాణం పూర్తి చేసి మనుగుడలోకి తీసుకువచ్చి సాంప్రదాయ రుచులను అందిస్తారని ఎదురుచూసిన పర్యాటకులకు అభిరుచులు అందేనా????
