జగన్‌పై విజయసాయిరెడ్డి సంచలనం.. నేను మారలేదు.. పదవి వచ్చాక నువ్వే మారిపోయావు

భారత్ న్యూస్ విశాఖపట్నం..*జగన్‌పై విజయసాయిరెడ్డి సంచలనం.. నేను మారలేదు.. పదవి వచ్చాక నువ్వే మారిపోయావు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్‌పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

”నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది…. నువ్వే (వైఎస్ జగన్) పదవి వచ్చాక మారిపోయావు!… మూడు దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబం తో అనుబంధం ఉంది. పెళ్ళి చేసుకున్న వారే విడిపోతున్నారు… మాది రాజకీయ బంధం, ఇందులో ఆశ్చర్యం ఏముంది?. ప్రలోభాలకు లొంగను, ఎవ్వరికీ భయపడను, విశ్వసనీయత కోల్పోయే తత్వం కాదు. భక్తి ఇప్పుడూ ఉంది… అప్పుడూ ఉంది. కాకపోతే గతంలో మా నాయకుడి మీద ఉండేది. ఇప్పుడు దేవుడి మీద మాత్రమే ఉంది.

ఆయనకు ఇంకా నా గురించి ఏమి తెలియదు. నేను ఎవ్వరి ప్రలోభాలకు లొంగే రకం కాదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్నో బాధలు పడ్డాను. అయినా అక్కడ ఉంటే నా బాధలు తగ్గవని అర్ధమైంది. అందులోంచి తప్పుకున్నాను.. ప్రశాంతంగా హాయిగా ఉన్నాను” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

అలాగే మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అని… ఈ కేసు సిట్ చూస్తుందని… భవిష్యత్తులో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానేమోనని విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.