..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇటీవల దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని లోకేష్ గుర్తుచేసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఉగ్ర నరసింహ రెడ్డి, బిఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు….
